మాజీ సర్పంచ్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి

మాజీ సర్పంచ్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి

ప్రకాశం: కొండపి(M) చిన వెంకన్నపాలెం మాజీ సర్పంచ్ పోటు మోహనరావు చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి స్వామి బుధవారం నివాళులర్పించారు. మోహన రావు గ్రామంలో సర్పంచ్‌గా రెండు పర్యాయాలు కొనసాగాడు. ఇటీవల అనారోగ్యంతో మోహన్ రావు మృతి చెందాడు. బుధవారం ఆయన కర్మంతర కార్యక్రమానికి మంత్రి స్వామి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి మోహనరావు మృతి పట్ల సంతాపం తెలియజేశారు.