ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
BHPL: భూపాలపల్లిలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిదర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పార్టీకి కార్యకర్తలే అసలైన పట్టుకొమ్మలు అని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని జిల్లా అధ్యక్షులు అన్నారు.