సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం సింహ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. విశేష పుష్ప అలంకరణతో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.