పెండింగ్ అర్జీలను పరిష్కరించుకోండి: కలెక్టర్

WNP: సమాచార హక్కు చట్టం 2025కు సంబంధించిన పెండింగ్ అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు రాష్ట్ర సమాచార కమిషనర్లు నలుగురు ఈనెల 23న జిల్లాకు విచ్చేస్తున్నట్లు ఇన్‌చార్జ్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. జిల్లాలోని ప్రజలు సమాచార హక్కు చట్టంకు సంబంధించిన పెండింగ్ అర్జీలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిషనర్ల ఎదుట హాజరై పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.