క్రూజ్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించిన కిమ్
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ క్రూజ్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించారు. కిమ్‌తోపాటు ఆయన కుమార్తె కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పబ్లిష్ చేసింది. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ఉ.కొరియా క్షిపణి పరీక్షలు చేయడం గమనార్హం.