లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
సత్యసాయి: పరిగిలోని చెరువు కట్ట కింద పన్నాడమ్మా దేవాలయం వద్ద గురువారం ఓ లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వరి తవుడు లోడుతో హిందూపురం వైపు వెళ్తున్న ఈ లారీ రహదారి మలుపు వద్ద అధిక లోడ్ కారణంగా బ్యాలెన్స్ తప్పి పక్కకు తిరిగింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.