వైభవంగా శివపార్వతుల కళ్యాణం
SRPT: మాస శివరాత్రిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సంతోషి మాత ఆలయంలో శనివారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. అర్చకులు వంశీకృష్ణ శర్మ శాస్త్రోక్తంగా వేడుక నిర్వహించారు. 2026 నుంచి ప్రతి మాస శివరాత్రికి ఈ క్రతువు జరపనున్నట్లు ఆలయ అధ్యక్షులు మురళీధర్ తెలిపారు. ఈ కళ్యాణ వీక్షణంతో శీఘ్ర వివాహ యోగం కలుగుతుందని భక్తుల నమ్మకం.