'DCCB సేవలపై విస్తృత అవగాహన కల్పించాలి'

VZM: DCCB సేవలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున సూచించారు. మంగళవారం గుర్ల బ్యాంకును ఆయన సందర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో బ్యాంకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించాలని, డిపాజిట్లను అధికం చేయాలని సిబ్బందికి సూచించారు.