మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

MDK: రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వారిని తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీవో షాజుల్లోద్దీన్, ఎంఈవో శ్రీనివాస్ ఘనంగా సన్మానించి అభినందించారు.