VIDEO: హుజురాబాద్‌లో భారీ వర్షం
KNR: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో మొంథా తుఫాన్ ప్రభావం వలన ఇవాళ ఉదయం నుంచి ముసురు వాన ప్రారంభమై మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని మార్కెట్లో చిరు వ్యాపారులు క్రియ విక్రయాలకు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆకాల వర్షంతో వరి ధాన్యం తడసి ముద్దైపోయింది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.