ఏడుగురు ప్రత్యేక అధికారులు నియామకం
ASR: కొయ్యూరు మండలానికి ఏడుగురు ప్రత్యేక అధికారులు నియమితులయ్యారని ఎంపీడీవో ప్రసాదరావు గురువారం తెలిపారు. ఆడాకుల, అంతాడ తదితర పంచాయతీలకు తహసీల్దార్ పీ.మురళీ బాబు, కొమ్మిక, రాజేంద్రపాలెం ఎంపీడీవో స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారన్నారు. అలాగే మిగిలిన పంచాయతీలకు ఏఈఈ రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయికృష్ణ, ఏవో శివరామ్ ప్రసాద్ తదితరులు నియమితులయ్యారన్నారు.