'దేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకం'

ADB: బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన జవాన్ మేఘనాథ్ జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తూ గత 3 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ జవాన్ కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.