బంగారు చీరను ఆవిష్కరించిన మాజీ మంత్రి

బంగారు చీరను ఆవిష్కరించిన మాజీ మంత్రి

HYD: బంగారు, వెండి తీగలతో నేతన్న రూపొందించిన అద్భుతమైన చీరను మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. చేనేత కళారత్న అవార్డు గ్రహీత విజయ్ రెండు గ్రాముల బంగారం, రెండు గ్రాముల వెండిని ఉపయోగించి ఈ చీరను నేశారు. కేటీఆర్ తన నివాసంలో ఈ చీరను ఆవిష్కరించి, కళాకారుడి నైపుణ్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. చేనేత రంగానికి ఇటువంటి వినూత్న ప్రయోగాలు గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.