బుచ్చి లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

బుచ్చి లో  కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

NLR: బుచ్చి పట్టణంలోని మంగళకట్ట ప్రాంతంలో సిఐ శ్రీనివాస రావు, ఎస్ఐ సంతోష్‌రెడ్డి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి అనుమానస్పద వ్యక్తులపై ఆరా తీశారు. ప్రాంతంలో జల్లెడ పట్టి సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు సిఐలు, ఆరుగురు ఎస్సైలు, 50 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.