రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్రగాయాలు

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ గేటు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్తుతెలియని వాహనం వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గాయపడ్డ వ్యక్తిని 108లో స్థానికులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.