VIDEO: ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య: చౌడేపల్లి మండలం అప్పినపల్లికి చెందిన 24 ఏళ్ల సాయికుమార్, డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు గమనించి అతన్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉద్యోగాల కోసం యువత పడుతున్న ఆవేదనను మరోసారి తెలియజేస్తోంది.