CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ. 6,18,416 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.