వ్యక్తి గొంతు కోసి పరారైన దుండగులు

వ్యక్తి గొంతు కోసి పరారైన దుండగులు

ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడులో దారుణం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సంపేట సాయి అనే వ్యక్తి గొంతు కోసి దుండగులు పరారయ్యారు. తల్లంపాడులో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పని చేస్తుండగా బలవంతంగా బండి ఎక్కించుకుని ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుని పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.