అన్నవరం ఆలయంలో వేల సంఖ్యలో వరలక్ష్మీ వ్రతాలు

KKD: శ్రావణ మాసం ఆఖరి శుక్రవారము సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో 9,680 మంది మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవో సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కొండమీదకి వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.