రేపటి నుంచి జిల్లా కేంద్రంలో యోగా తరగతులు
KMR: జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో గల ఎస్.ఎస్.వై ఆశ్రమంలో ఈ నెల 15 నుంచి సిద్ధి సమాధి యోగ (ఎస్.ఎస్.వై) తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మురళీధర్ రాజు తెలిపారు. ఈ యోగా తరగతులు ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయని ఆయన వివరించారు. ఆసక్తి కలవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.