భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
MBNR: నవాబ్‌పేట మండల పరిధిలోని మరికల్ గ్రామానికి చెందిన శేఖరయ్య (50) అనే వ్యక్తి శనివారం తన వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు నెలల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శేఖరయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.