వృద్ధురాలి హత్య కేసులో ఐదుగురి అరెస్టు

వృద్ధురాలి హత్య కేసులో ఐదుగురి అరెస్టు

TPT: తిరుపతి జీవకోనలో ఇటీవల దారుణ హత్యకు గురైన వృద్ధురాలి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. ఈనెల 11న శాంతమ్మ (64) దారుణ హత్యకు గురైందన్నారు. నగదు, బంగారం కోసం ఆమె ఇంట్లో అద్దెకుంటున్న వారే హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్‌పీ భక్తవత్సలం తెలిపారు.