రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించాలని అన్నారు.