పులుల గణన సర్వే నిర్వహించిన సిబ్బంది

పులుల గణన సర్వే నిర్వహించిన సిబ్బంది

ASR: జాతీయ పులుల గణనలో భాగంగా జీకేవీధి మండలం ఆర్వీ నగర్ రేంజ్ పరిధి సప్పర్ల బీట్లో అటవీశాఖ సిబ్బంది, సాంకేతిక నిపుణుల బృందం కలసి పులుల గణన కోసం సర్వే నిర్వహించారు. అటవీప్రాంతంలో పులుల పాద ముద్రలను పరిశీలించారు. పులులతోపాటు ఇతర వన్యప్రాణుల గణన కోసం వారం రోజుల నుంచి సర్వే నిర్వహించినట్లు బీట్ ఆఫీసర్లు రాజ్ కుమార్, నవీన్, శ్రీనివాస్ సోమవారం తెలిపారు.