ద్వారకాతిరుమలలో రేపటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు
ELR: ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో 16వ తేదీ నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో తిరుప్పావై సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 29న స్వామివారి పాదుకా మండపం నుంచి శేషాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షణ, ఈనెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, వచ్చే నెల 9 వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.