‘నెతన్యాహు బతికే ఉన్నారు, నేరుగా చూశాను’
ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు మరణించారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అదంతా కేవలం తప్పుడు ప్రచారమేనని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రౌవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇటీవల నెతన్యాహు కాఫీ తాగుతున్న వీడియో AI సృష్టించినది కాదని, అది వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు. తానే స్వయంగా నెతన్యాహును కలిశానని, ఆయన క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.