డీఎస్సీలో జిల్లా 10వ ర్యాంకు సాధించిన వివాహిత

శ్రీకాకుళం: డీఎస్సీ ఫలితాల్లో మందస గ్రామం దేవర వీధికి చెందిన వివాహిత సంతోషి కుమారి చల్లా సత్తా చాటింది. 90.77 మార్కులు సాధించి ఎస్‌జీటీ విభాగంలో జిల్లా స్థాయిలో 10వ ర్యాంకు కైవసం చేసుకుని అందరిదృష్టి ఆకర్షించింది. ఓవైపు గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే కష్టపడి ప్రణాళిక బద్ధంగా ఇంటివద్దనే చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల పలువురు అభినందించారు.