పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
JGL: మేడిపెల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్‌లో గల ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.