లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కర్ణాటక ఎమ్మెల్యే
SS: కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామిని కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురం MLA ధీరజ్ మునిరాజ్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. లోకకల్యాణార్థం స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.