మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: సీఐ
VKB: ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని సీఐ వెంకట్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎస్సై భరత్ భూషణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారని తెలిపారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అల్లా కటాక్షం అందరిపై ఉండాలని కోరారు.