పండుగ రోజుల్లోనూ పనిచేయనున్న కార్యాలయాలు

NLG: మార్చి 30, 31 తేదీల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు యథావిథిగా పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ చెల్లించడానికి ఈనెల 31వ తేదీ వరకు ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించినందున ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు పనిచేయడంపై ఉత్తర్వులను జారీ చేసింది.