VIDEO: హిమాయత్‌సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత

RR: హిమాయత్‌సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి నాలుగు గేట్లను నాలుగు అడుగుల ఎత్తు వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీ నదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో, ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డును పోలీసులు మూసివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.