'పోలీస్ శాఖలో పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయి'
BDK: పోలీస్ శాఖలో పదోన్నతులు తమ బాధ్యతలను మరింతగా పెంచుతాయని ఎస్పీ తెలిపారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది జిల్లాకు కేటాయించబడిన 14 మంది అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం అభినందించారు. 1998 బ్యాచ్‌లో కానిస్టేబుళ్లుగా నియమితులై, ఇటీవల పదోన్నతి పొందిన ఈ అధికారులు ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చి రిపోర్ట్ చేశారు.