విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస మండలంలోని అక్కివరం పంచాయతీ గోపి నగర్‌లో అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వహకులు ఆహ్వానం మేరకు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ హాజరయ్యారు. అనంతరం అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.