శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు: సీఐ
KRNL: శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం కర్నూల్ ట్రాఫిక్ సీఐ మనసూరుద్దీన్ హెచ్చరించారు. వెంకటరమణ కాలనీ పంప్ హౌస్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అధిక శబ్దం చేసే మోడిఫైడ్ రెండు చక్రాల వాహన సైలెన్సర్లపై తనిఖీలు చేపట్టి 15 సైలెన్సర్లను స్వాధీనం చేసుకొని, MVI చలాన్లు విధించినట్లు వెల్లడించారు.