ప్రధాని 'మన్ కీ బాత్' వీక్షణ

ప్రధాని 'మన్ కీ బాత్' వీక్షణ

ATP: అనంతపురం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రధాని మోదీ ప్రసంగించిన 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించారు. జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశాభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని నేతలు ఆసక్తిగా విన్నారు. అనంతరం ప్రధాని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాజేష్ నాయకులకు సూచించారు.