భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్య ధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణంపేటలో 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్ నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. ముందు ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు తెలిపారు.