యువజనోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
NGKL: జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో 2025-26 యువజనోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ బాదావత్ సంతోష్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.