చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై హారిక
KDP: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సిద్ధవటం(మం) మాధవరం-1బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం సిద్ధవటం ఎస్సై హారిక ప్రారంభించారు. ఈ చలివేంద్రంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందించనున్నారు. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, శరీరానికి తగినంత నీరు తీసుకోవడం మంచిదని SI సూచించారు.