మెట్రో స్టేషన్లకు పోటెత్తిన జనం
TG: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సులు నిలిచిపోవడంతో ఆటోలు, క్యాబుల్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో జనం మెట్రో వైపు మళ్లారు. ముఖ్యంగా ఎల్బీనగర్, అమీర్‌పేట వంటి కీలక స్టేషన్లలో టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫారమ్‌ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో అధికారులు అదనపు సర్వీసులను నడుపుతున్నారు.