'మీకోసం' కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి: MRO

'మీకోసం' కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి: MRO

కడప: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన 'మీకోసం' కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తొండ MRO మధురవాణి సూచించారు. అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారం కాలేదంటే, వాటి స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.