భార్య గొంతు కోసిన భర్త
KMR: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా భర్త తన భార్య గొంతును కోసినట్లు శుక్రవారం ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. నాగిరెడ్డిపేట మండలం చీనురు గ్రామానికి చెందిన నారాయణ ఆయన భార్య రామవ్వ మధ్య గొడవ జరిగిందన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన నారాయణ తన భార్య గొంతు కోసినట్లు చెప్పారు. గాయపడిన రామవ్వను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.