నేడు మండలంలో పర్యటించనున్న మంత్రి

ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ఉదయం జె.పంగులూరు మండలంలోని కొండమంజులూరు, ముప్పవరం గ్రామాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటన కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గంలోని నాయకులు, కూటమి కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.