హోంగార్డు ఇంటిపై ఏసీబీ దాడులు
VZM: గుర్లలోని నడుపూరులో గురువారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఏసీబీలో హోంగార్డుగా పని చేసిన శ్రీను ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో దాడులు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.