కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న వైసీపీ నాయకులు

కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న వైసీపీ నాయకులు

E.G: బొమ్మూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ముఖ్య నాయకులతో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొని కోటి సంతకాల సేకరణ చేపట్టారు. జిల్లాలో 4,20,000 లక్షల సంతకాలు సేకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.