ట్రంప్‌తో విభేదాలు.. మస్క్ కీలక ప్రకటన

ట్రంప్‌తో విభేదాలు.. మస్క్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు విభేదాలు తలెత్తాయని పలు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ విధుల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం తన బాధ్యతలు ముగిశాయని తెలిపారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. డోజ్ మిషన్ కాలక్రమేణా బలపడుతుందని పేర్కొన్నారు.