డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన బండి సంజయ్
KNR: హుజురాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈప్రాంతంలో నెమళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయని, డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ డంపింగ్ యార్డులకు వ్యతిరేకం కాదని, కానీ అది ప్రజలకు ఇబ్బంది కలగని దూర ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేశారు.