జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు సిద్దిపేట విద్యార్ధిని
SDPT: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధిని రవలి ఎంపికయ్యింది. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, రంగారెడ్డి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లింగ్ పోటిల్లో రవళి తృతీయ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికయింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. సునీతా రవళిని సన్మానించారు.