'ఆలయానికి రూ. 1.10 లక్షల విరాళం'
MDK: శివంపేట మండలం ఎదులాపూర్‌లో శ్రీ ఎల్లమ్మ ఆలయానికి రూ. 1.10 లక్షల విరాళం అందజేశారు. ఎదులాపూర్‌లో ఎల్లమ్మ ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నారు. ఆలయానికి కల్లూరి హనుమంతరావు రూ. 60 వేలు, కల్లూరి హరికృష్ణ రూ. 50 వేలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో భూరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.