నీటి నిల్వపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందన

RR: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా FCI కాలనీ మెయిన్ రోడ్‌పై వర్షపు నీరు భారీ స్థాయిలో నిల్వ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను FCI కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన సంబంధిత శాఖ అధికారులను ఫోన్‌లో సంప్రదించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.